డిజిటల్ వేదికలద్వారా (డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్) బ్యాంకింగ్ చేస్తున్నపుడు జాగ్రత్త వహించండి ఎవరూ మిమ్మల్ని దగాచేయనివ్వకండి. మీ పాస్వర్డ్, పిన్, ఓటీపీ, సీవీవీ, యూపీఐ-పిన్ మొదలైన వాటిని ఎప్పుడూ ఎవరికీ తెలియనీయకండి. తక్షణ హెచ్చరికలు పొందేందుకు మీ మొబైల్ నెంబర్నీ మరియు ఈమెయిల్నీ మీ బ్యాంక్‌లో నమోదు చేయించండి. ముఖ్యమైన బ్యాంకింగ్ వివరాలను మొబైల్, ఈమెయిల్ లేదా పర్స్‌లో పెట్టుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్‌కి ప్రమాణీకరించబడిన, సురక్షితమైన, విశ్వసనీయమైన వెబ్‌సైట్స్‌ని మాత్రమే వాడండి. బహిరంగ లేక ఉచిత నెట్ వర్కుల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు చేయవద్దు. మీ ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్నీ మరియు పిన్నీ ఎప్పటికప్పుడు మార్చండి. మీ ఏటీఎమ్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ప్రీపెయిడ్ కార్డ్ పోయినా లేక దొంగిలించబడినా, దాన్ని వెంటనే బ్లాక్ చేసేయండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్