పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏమిటి? చాలా మందికి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ క్లిష్టమైన అంశంగా అనిపిస్తుంది. కానీ అది అలా కాదు. మీరు దీనిని సులువుగా అర్థం చేసుకోవడానికి మేము సహాయపడతాము. ఒకరు రూ. 10,000 @ 8% సంవత్సరానికి ఇన్వెస్ట్ చేసారని అనుకుందాము. సంవత్సరానికి వడ్డీ రూ. 800 అవుతుంది. అయితే, అదే ఇన్వెస్ట్మెంట్లో వడ్డీ రీఇన్వెస్ట్ చేసినప్పుడు, తరువాత సంవత్సరం వచ్చే ఆదాయం ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ రూ. 10,000 సహా అదనపు ఇన్వెస్ట్మెంట్ రూ. 800 కూడా ఉంటుంది. అంటే దీని అర్థం రెండవ సంవత్సరానికి సంపాదన రూ. 864 అని అర్థం. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, ప్రతి సంవత్సరం అదనపు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కావున సంవత్సరానికి వడ్డీ పెరుగుతూ ఉంటుంది. రిటర్నులు మళ్లీ ఇన్వెస్ట్ చేస్తే నిర్దిష్ట కాలానికి ఎంత డబ్బు పొగవుతుంది? మనం చూద్దాము. ఇన్వెస్ట్మెంట్: రూ. 1,00,000రిటర్ను రేట్: 8% సంవత్సరానికి దీర్ఘ కాలానికి ఇన్వెస్ట్మెంట్ ఉంచితే, సంపాదన వేగంగా పెరుగుతూ ఉంటుంది. మొదటి 5 సంవత్సరాలలో సంపాదన రూ. 0.47 లక్షలు, అదే దానికి తరువాతి 5-సంవత్సరాల కాలంలో రూ. 0.69 లక్షలు (రూ. 2.16 లక్షలు– రూ. 1.47 లక్షలు) 21వ సంవత్సరంలో సంపాదన – ఒకే సంవత్సరం లో – రూ. 0.37 లక్షలు. “సమయం గడిచే కొద్దీ, సంపాదనలు వృద్ధి కావు, కానీ విశేషంగా(చక్ర వడ్డీ గా) పెరుగుతాయి.” ఆవశ్యకంగా, మీ అసలు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ సంపాదించిన ఆదాయాల మీద ఆదాయాన్ని పొందే ప్రక్రియను కాంపౌండింగ్ అంటారు – అదే మొత్తం రీఇన్వెస్ట్ చేయడం వలన కూడా ఆదాయం రావడం మొదలవుతుంది. దయచేసి గమనించండి ఈ క్యాలిక్యులేషన్లు విశదీకరణ కొరకు మాత్రమే, వాస్తవ రాబడులను సూచించవు. మ్యూచువల్ ఫండ్స్ కి స్థిరమైన రాబడి రేటు అంటూ ఉండదు, అంతేకాకుండా రాబడి రేటును ముందుగానే ఊహించడం సాధ్యం కాదు. చివరిగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి మీకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది మరియు ఇది సులభమైన పెట్టుబడి ఎంపిక కూడా. మీరు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పుడు, దానితో ముడిపడిన మార్కెట్ రిస్క్‌ల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. డిస్క్లైమర్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు. ఆధారం: మ్యూచువల్ ఫండ్స్ సరైనదే