విభిన్న రకాల ఈక్విటీ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయా? ఇన్వెస్టర్ల విభిన్న అవసరాలను తీర్చేందుకు విభిన్న రకాల ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. అన్నిటి ఉద్దేశ్యం దీర్ఘ కాలాలకి లాభాలను ఉత్పత్తి చేయడం. దీనిని చక్కగా అర్థం చేసుకోవడానికి, ఒలింపిక్ గేమ్స్‌కు పంపించే బృందాన్ని మనం ఒకసారి చూద్దాము. పెద్ద ప్లేయర్ల గ్రూపు ఉన్నది మరియు తరువాత విభిన్న క్రీడల కొరకు టీములు ఉన్నాయి. ఒలింపిక్ గేమ్స్‌లో పెద్ద ఈవెంట్లలో “ట్రాక్ అండ్ ఫీల్డ్” ఈవెంట్ ఒకటి. మనం ఈ ఈవెంట్ల గ్రూపుని కూడా పంపుతాము. దాని లోపల, కొన్ని రేసులు ఉన్నాయి - 100- మీటర్ల స్ప్రింట్, దూరం రేసుల, మారథాన్ సహా ఉన్నాయి. మొత్తం బృందం ఒలింపిక్ గేమ్స్‌లో పోటీ చేయడానికి వెళ్ళినా, విభిన్న బలాలలో విభిన్న క్రీడాకారులు ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇలాంటివే. అన్ని మ్యూచువల్ ఫండ్స్ పూర్తి ఒలింపిక్ బృందానికి సమానమైతే, ఈక్విటీ ఫండ్స్ విభిన్న ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో పాల్గొనే గ్రూపు లాగా ఉండవచ్చు. మనం చూసినట్లు, ట్రాక్ అండ్ ఫీల్డ్ లోపల కూడా ఉప-వర్గాలు ఉన్నాయి, ఈక్విటీ ఫండ్స్‌లో కూడా విభిన్న స్కీములు ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్ లోపల విభిన్న స్కీములు లార్జ్-క్యాప్ స్కీములు పెద్ద- సైజ్, మార్కెట్ లీడర్ కంపనీలలో పెట్టుబడి పెట్టినవి. ఈక్విటీ ఫండ్స్ ఇతర రకాల కన్నా ఈ ఫండ్స్ మరింత స్థిరమైనవిగా పరిగణించబడతాయి. మిడ్-క్యాప్ స్కీములు భవిష్యత్తులో మార్కెట్ లీడర్లు అయ్యే సంభావ్యత ఉన్న కంపెనీలలో మిడ్- సైజ్డ్లో పెట్టుబడి పెట్టబడుతుంది. వాటి అభివృద్ధి సంభావ్యత వలన, ఈ ఫండ్స్ అధిక రిటర్నులు ఇవ్వడానికి సంభావ్యతని కలిగి ఉంటాయి. అదే సమయంలో, ఈ స్కీములు లార్జ్ క్యాప్ ఫండ్స్ కన్నా అధిక రిస్కుని కలిగి ఉంటాయి. స్మాల్-క్యాప్ స్కీములు ఈ స్కీములు పెరుగుదలకు అత్యధిక సంభావ్యత ఉన్న చిన్న సైజు కంపెనీలలో పెట్టబడి పెడతాయి అందుకే ఎక్కువ రిటర్నులను అవకాశం కలిగి ఉంటాయి. ఈ మూడింటిలో, అంటే, లార్డ్, మిడ్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్స్ లో; ఇవి అత్యంత రిస్క్ కలిగినవి. మల్టీ-క్యాప్ స్కీములు ఈ స్కీములు లార్ట్, మిడ్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్ల్లో పెట్టుబడి పెట్టడానికి స్వేచ్చాయుతమైనవి. పెట్టుబడుదారుడికి ఎప్పడైతే మార్కెట్ క్యాప్ లోని స్మాల్ క్యాప్ డ్స్ లార్జ్ క్యాప్, లేదా మీడిక్యాప్ ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా తన పెట్టుబడిని వీటిలో ఎదె ఒకదానిని ఎంపిక చేసుకోకూడదని అనుకుంటే మల్టీక్యాప్ స్కీములు ఉత్తమమైనవి. ఇండెక్స్ ఫండ్స్ అట్టి స్కీములలో సెక్యూరిటీలను ఎన్నుకోవడంలో ఫండ్ మేనేజరకు ఏ పాత్ర ఉండదు. ఈ స్కీములు ఒక ఇండెక్స్ కాంపోజిషన్‌ను, నిఫ్టీ 50 లేదా ఎస్ అండ్ బిఎస్ఇ సెన్సెక్స్ లాగా ప్రతిబింబిస్తాయి. థీమాటిక్ ఫండ్స్ కొన్ని ఈక్విటీ ఫండ్స్, బ్యాంకింగ్, ఫార్మా మొదలగు ఒక సింగిల్ ఇండస్ట్రీ చెందిన కంపెనీలలో పెట్టుబడి చేస్తాయి, కాగా కొన్ని విభిన్న ఇండస్ట్రీల మధ్య పెట్టబడి పెడతాయి కానీ ఒక థీమని అనుసరిస్తాయి. ఉదా. ఎమ్ఎఎన్ సి ఫండ్స్, పిఎస్సీ ఫండ్స్, మొదలగునవి. డిస్క్లైమర్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు. ఆధారం: మ్యూచువల్ ఫండ్స్ సరైనదే