చిరిగిన లేదా ముక్క-ముక్కలైన నోట్లని బ్యాంక్‌లో మార్చుకోవచ్చు నోట్లని సేవ్ చేసుకుని ఏ బ్యాంక్ బ్రాంచ్నైనా సందర్శించి మీ చిరిగిన నోట్లని కొత్త నోట్లుగా మర్చుకోవచ్చు. అలవాటు మార్చుకోండి నోట్ మార్చుకోండి. తడిసిన, చిరిగిన, దెబ్బతిన్న, మ్యుటిలేటెడ్ లేదా డిఫెక్టివ్ కరెన్సీ నోట్లను బ్యాంకు శాఖల్లో కౌంటర్లలో మార్చుకోండి. కరెన్సీ నోట్లను మీ సమీపంలోని బ్యాంకు శాఖలో మార్చుకోవచ్చు. బ్యాంకు శాఖ నోట్లను మార్చుకోవడానికి నిరాకరిస్తే, బ్యాంకుకు ఫిర్యాదు చేయండి. ఒక నెలపాటు ఫిర్యాదు పరిష్కారం కాకుంటే మీరు RBI అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయవచ్చు. RBI Note refund Rules, 2009 (amended in 2018) ప్రకారం కరెన్సీ నోట్లు మార్చబడతాయి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా