అంతరాయం లేని బ్యాంకింగ్ సేవల కోసంమీ KYCని అప్-టు-డేట్ ఉంచండి ఒకవేళ మీ KYC వివరాల్లో మార్పులేమీ లేకుంటే, పత్రం / ఆన్లైన్ బ్యాకింగ్ / మొబైల్ బ్యాకింగ్ / ఎటిఎం / మీ మొబైల్ నంబర్ / ఇమెయిల్ ద్వారా మళ్లీ ఒకసారి KYC కోసం స్వీయ - ప్రకటనను మీ బ్యాంకు లేదా బిజినెస్ కరస్పాండెంన్స్ (బిసి ల) వద్ద సమర్పించండి. ఒకవేళ మీ KYC వివరాల్లో మార్పులు జరిగి ఉంటే, కొత్తగా మార్పు చేయబడిన వివరాలతో కూడిన ఏదైన ఒక పత్రం యొక్క కాపీని సమర్పించండి అవి: ఆధార్ / ఓటరు ఐడి కార్డ్ / NREGA జాబ్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్ / పాస్పోర్ట్ / జాతీయ జనాభా రిజిష్టరు ద్వారా జారీ చేయబడిన పత్రం. మీరు మీ సమీప బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా కూడా మీ KYCని అప్-టు-డేట్ చేసుకోవచ్చు. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్