ఆర్థిక లావాదేవీల విషయంలో తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు సురక్షితమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం (For safe internet browsing) అసురక్షిత / ప్రమాదకరమైన / తెలియని వెబ్సైట్లను సందర్శించడం నివారించండి. తెలియని బ్రౌజర్లను ఉపయోగించడం నివారించండి. పబ్లిక్ పరికరాలలో (public devices) పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం లేదా సేవ్ చేయడం నివారించండి. తెలియని వెబ్సైట్లు లేదా పబ్లిక్ పరికరాలలో మీ సురక్షిత ఆధారాలను (credentials) నమోదు చేయడం నివారించండి. సోషల్ మీడియాలో ఎవరితోనూ, ముఖ్యంగా తెలియని వ్యక్తులతో ప్రైవేట్ సమాచారాన్ని పంచుకోవద్దు. ఏదైనా వెబ్‌పేజీ యొక్క భద్రతను ఎల్లప్పుడూ ధృవీకరించండి (https:// - ప్యాడ్‌లాక్ చిహ్నంతో కూడిన URL). ఈమెయిల్ లేదా SMS లింక్ ద్వారా ఆ పేజీలకు రీడైరెక్ట్ అయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. సురక్షితమైన ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం (For safe internet banking) పబ్లిక్ పరికరాలలో ఎల్లప్పుడూ వర్చువల్ కీబోర్డ్ (virtual keyboard) ఉపయోగించండి, ఎందుకంటే హ్యాక్ చేయబడిన పరికరాలు లేదా కీబోర్డ్‌ల ద్వారా మీరు నొక్కే కీలు (keystrokes) రికార్డ్ అయ్యే ప్రమాదం ఉంది. ఉపయోగించిన వెంటనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సెషన్ నుండి లాగ్ అవుట్ అవ్వండి. క్రమంతప్పకుండా నిర్ణీత కాల వ్యవధిలో పాస్‌వర్డ్‌లను అప్డేట్ చేయండి. మీ ఈమెయిల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించవద్దు. ఆర్థిక లావాదేవీల కోసం పబ్లిక్ టెర్మినల్స్ (సైబర్ కేఫ్ మొదలైనవి) ఉపయోగించడం నివారించండి. ఫోన్ నిఘాలో (స్పైయింగ్) ఉందని సూచించే అంశాలు ఫోన్లో మీకు తెలియని యాప్‌లు డౌన్లోడ్ అవ్వడం. ఫోన్ బ్యాటరీ సాధారణం కంటే చాలా వేగంగా అయిపోవడం. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైనా స్పైవేర్‌ని రన్ చేయడం వల్ల ఫోన్ వేడెక్కడం ఒక సంకేతం కావచ్చు. డేటా వినియోగం (డేటా కన్సప్షన్) అకస్మాత్తుగా పెరగడం అనేది కొన్నిసార్లు బ్యాక్‌గ్రౌండ్‌లో స్పైవేర్ నడుస్తోందనడానికి సంకేతం కావచ్చు. స్పైవేర్ యాప్‌లు కొన్నిసార్లు ఫోన్ షట్‌డౌన్ ప్రక్రియకు అంతరాయం కలిగించవచ్చు, దీనివల్ల పరికరం సరిగ్గా ఆఫ్ అవ్వదు లేదా ఆఫ్ అవ్వడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది. డేటాను పంపడానికి మరియు స్వీకరించడానికి స్పైవేర్ మరియు మాల్వేర్ల ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లను ఉపయోగించవచ్చని గమనించండి. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్