క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మోసం (Scam through QR code scan) మోసపూరిత విధానం (Modus Operandi) మోసగాళ్లు తరచుగా రకరకాల నెపాలతో కస్టమర్లను సంప్రదించి, వారి ఫోన్లలోని యాప్ల ద్వారా క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్లను స్కాన్ చేసేలా ట్రిక్ చేస్తారు (బురిడీ కొట్టిస్తారు). ఇటువంటి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా, కస్టమర్లు తమకు తెలియకుండానే తమ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకోవడానికి మోసగాళ్లకు అనుమతి ఇచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు (Precautions) ఏదైనా పేమెంట్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక నిర్దిష్ట ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి అవసరమైన ఖాతా వివరాలు ఈ క్యూఆర్ కోడ్లలో నిక్షిప్తమై ఉంటాయి. డబ్బును స్వీకరించడానికి (పొందడానికి) ఎప్పుడూ ఎలాంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవద్దు. డబ్బు వచ్చే లావాదేవీలకు బార్కోడ్లు/క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయాల్సిన అవసరం గానీ, మొబైల్ బ్యాంకింగ్ పిన్ (m-PIN), పాస్వర్డ్లు మొదలైన వాటిని ఎంటర్ చేయాల్సిన అవసరం గానీ ఉండదు. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్