ఏటీఎం కార్డ్ స్కిమ్మింగ్ (ATM card skimming) పనిచేసే విధానం మోసగాళ్లు ఏటీఎం మిషన్లలో స్కిమ్మింగ్ పరికరాలను అమర్చి, కస్టమర్ కార్డ్ నుండి డేటాను దొంగిలిస్తారు. మోసగాళ్లు ఏటీఎం పిన్ (PIN)ను రికార్డ్ చేయడానికి ఒక డమ్మీ కీప్యాడ్ను లేదా కంటికి కనిపించకుండా దాచిన చిన్న / పిన్హోల్ కెమెరాను కూడా అమర్చవచ్చు. కొన్నిసార్లు, మోసగాళ్లు పక్కనే నిలబడిన ఇతర కస్టమర్లలా నటిస్తూ, కస్టమర్ ఏటీఎం మిషన్లో పిన్ని ఎంటర్ చేస్తున్నప్పుడు దానిని చూసి తెలుసుకుంటారు. ఈ డేటాను ఉపయోగించి డూప్లికేట్ కార్డ్ను తయారు చేసి, కస్టమర్ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేస్తారు. జాగ్రత్తలు (Precautions) లావాదేవీ చేయడానికి ముందు, ఏటీఎం మిషన్ యొక్క కార్డ్ ఇన్సర్షన్ స్లాట్ లేదా కీప్యాడ్ దగ్గర ఎలాంటి అదనపు పరికరం అమర్చబడి లేదని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. పిన్ (PIN) ఎంటర్ చేసేటప్పుడు కీప్యాడ్ను మీ ఇంకో చేత్తో కవర్ చేయండి (మరుగుపరచండి). మీ ఏటీఎం కార్డ్పై పిన్ను ఎప్పుడూ రాయకండి. మీకు దగ్గరగా నిలబడి ఉన్న ఇతర / తెలియని వ్యక్తుల సమక్షంలో పిన్ను ఎంటర్ చేయవద్దు. నగదు విత్డ్రా చేయడం కోసం మీ ఏటీఎం కార్డ్ను ఎవరికీ ఇవ్వవద్దు. ఏటీఎంల వద్ద తెలియని వ్యక్తులు ఇచ్చే సూచనలను పాటించవద్దు లేదా అపరిచితులు / తెలియని వ్యక్తుల నుండి సహాయం / మార్గదర్శకత్వం తీసుకోకండి. ఏటీఎంలో నగదు రాకపోతే, 'Cancel' బటన్ను నొక్కి, ఏటీఎం నుండి బయటకు వెళ్లే ముందు హోమ్ స్క్రీన్ కనిపించే వరకు వేచి ఉండండి. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్