RBI UDGAM పోర్టల్ మీ బ్యాంక్‌లో 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుండి క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న మీ డబ్బుని మళ్ళీ ఉపయోగపరచుకోండి. UDGAM లో దాన్ని కనుగొని బ్యాంక్ నుండి దాన్ని ఎలా పొందాలో తెలుసుకోండి. UDGAM పోర్టల్‌పై నమోదు చేసుకోండి. ఖాతాదారుని పేరు, బ్యాంక్(ల) పేరు మరియు జన్మదినం, ప్యాన్ కార్డ్ మొదలైనటువంటి వివరాలను ఉపయోగించి వెతకండి. UDGAM అనేది ఒక అన్వేషణ సౌకర్యం మాత్రమే. క్లెయిమ్ చేయబడని డిపాజిట్లను ఆయా బ్యాంక్(ల) నుండే క్లెయిమ్ చేసుకోవలసి ఉంటుంది. UDGAM పోర్టల్‌పై బ్యాంక్‌ల జాబితా లభిస్తుంది. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్